దాడిని ఖండించిన రెడ్డి అప్పల నాయుడు

దెందులూరు నియోజకవర్గంలోని వైసీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ పసుమర్తి మధు, తాట సత్యనారాయణ, రాజేష్ లను ఆయుష్ హాస్పిటల్ లో ఈరోజు రెడ్డి అప్పల నాయుడు పరామర్శించారు. సంబంధిత వైద్యులతో మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పెదవేగిలో జరుగుతున్న అక్రమ పోలవరం కుడి కాలువ గ్రావెల్ తవ్వకాల్ని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుల పైన వైఎస్ఆర్సిపి గుండాలు అతి దారుణంగా దాడి చేయడం అమానుషమని, ఇటువంటి ఘటనలు ఈ జిల్లాలోనే ఎప్పుడూ జరగలేదని, ఈరోజున వైసీపీ ప్రభుత్వం కడప పులివెందుల ఫ్యాక్షనిస్టుని దెందులూరులో అమలు చేస్తున్నారని రెడ్డి అప్పల నాయుడు మండిపడ్డారు. కొంతమంది మర్డర్ చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురిఅవుతున్నారని, మళ్లీ మీకు అధికారంలోకి రావాలనే కోరిక ఏదైతే ఉందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని, ఇలాంటి సంస్కృతికి ఎవరు పాల్పడినప్పటికీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దీనిని అరికట్టాలని, ఇది సరైన సంస్కృతి కాదని, ఇది ఇక్కడితోనే ఆగిపోదని, ఇక్కడి నుండి పరస్పర దాడులు ప్రజలకు గాని మీకు గాని ఏ విధమైన శ్రేయస్కరం కాదని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎక్కడైనా తప్పులు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి గాని భౌతిక దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు..?? ఇది గూండాగిరిని తలపిస్తుందని దీనిని జనసేన పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి సంస్కృతికి స్వస్తి పలకాలని, వ్యవస్థను సరైన మార్గంలో నడిపించాలని,ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు దండుకునే ప్రక్రియను మానుకోవాలని జనసేన పార్టీ నుండి హెచ్చరిస్తున్నామని, ఇది మళ్ళీ పునరావృతం అయితే ఇదే పరిస్థితి మీకు వస్తుందని, దీనిపై పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. పోలీసుల దగ్గర ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ఈ భౌతిక దాడిలో పాల్పడిన వైసిపి గుండాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.