అనంతపురం జిల్లా కలెక్టర్ కు జనసేన వినతి

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రెండవ డివిజన్ కల్పనా జోష్, భాగ్యనగర్, బిందెల కాలనీలలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించకపోవడం వల్ల నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు, ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్న విషసర్పాలు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్న స్పందించని అనంత నగర పరిషత్ అధికారులు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే, నగర మేయర్, మరియు కార్పొరేటర్లు. 800 కోట్లు ఖర్చుపెట్టి నగరాన్ని అభివృద్ధి చేశాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు, అభివృద్ధి అంటే ఇదేనా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ? రెండవ డివిజన్ ప్రజలు అనంతపురం జిల్లా జనసేన పార్టీ దృష్టికి తమ స్థానిక సమస్యలు తీసుకొనిరాగా అనంతపురం జిల్లా కలెక్టర్ ని కలిసి వినపత్రం అందించి, కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను, సమస్యను వివరించి ఇండ్ల మధ్యలోకి వచ్చిన డ్రైనేజ్ ఫొటోస్ ని చూపించి, కలెక్టర్ ని కాలనీలలో ఒకసారి సందర్శించి తక్షణమే యుద్ద ప్రాతిపదిక పైన డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. రెండో డివిజన్ కల్పన జోష్, భాగ్యనగర్, బిందెల కాలనీల ప్రజలు 12 అడుగుల ఉన్న విషసర్పాలు కాలనీలో సంచరిస్తున్నాయని, పాములు, తేళ్లు, పురుగు – పుట్ర ఇళ్లల్లోకి చొరబడుతున్నాయని దోమలు వ్యాప్తి చెంది విష జ్వరాలు వస్తున్నాయని, పందులు స్వైర విహారం చేయడం వల్ల పిల్లల అనారోగ్యానికి గురవుతున్నారని, వీధిదీపాలు కూడా సరిగ్గా వెలగడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్, జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, నగర అధ్యక్షులు బాబురావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, నాయకులు కాయగూరల లక్ష్మీపతి, జిల్లా కార్యదర్శిలు రాపా ధనుంజయ్, సంజీవ రాయుడు, ఇండ్ల కిరణ్ కుమార్, సిద్ధూ, శ్రీమతి జయమ్మ, ఆవుకు విజయ్ కుమార్, ముప్పురి కృష్ణ, నగర ఉపాధ్యక్షులు సదానందం, గ్రంధి దివాకర్, జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేష్, హుస్సేన్, దరాజ్ భాష, నగర కార్యదర్శులు లాల్ స్వామి, కుమ్మర మురళి, అంజి, సంపత్, వల్లంశెట్టి వెంకటరమణ, ఆకుల అశోక్, నెట్టిగంటి హరీష్, వీరమహిళలు శ్రీమతి అనసూయ, శ్రీమతి దాసరి సరిత, నాయకులు ఎం.సి.బాలన్న (అడ్వకేట్) ఎస్.నజీర్, విజయ భాస్కర్, హిద్దు, నజీమ్, శ్రీహరి, బళ్లారి అనిల్, వంశీ, విజయ రాయల్, నౌషాద్, సాదిక్, శిక్ష, కాలనీవాసులు పాల్గొనడం జరిగింది.