జ‌న‌సేన‌పై విమ‌ర్శ‌లు చేస్తే స‌హించేది లేదు!

  • వాపును చూసి బ‌లుపు అనుకోవ‌డం మ‌ల్లెల‌కే చెల్లింది
  • మీ కార్య‌క్ర‌మాల‌కు జ‌నాన్ని ఎలా త‌ర‌లించారో అంద‌రికీ తెలుసు
  • జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌: వైఎస్సార్ సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌ల్లెల రాజేష్‌నాయుడు ప్ర‌తిపక్ష పార్టీల స‌భ‌ల‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల‌పై అనాలోచిత వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజీ హిత‌వు ప‌లికారు. సోమ‌వారం మ‌ల్లెల రాజేష్‌నాయుడు మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. రాప్తాడులో జ‌రిగిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స‌భ చూసిన త‌ర్వాత జ‌న‌సేన‌, టీడీపీ ఓట‌మీ ముందే ఖారారైంద‌ని, ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన స‌భ‌ల‌కు ప్ర‌లోభాల‌కు గురి చేసి తీసుకువ‌స్తున్నార‌ని మాట్లాడం జ‌రిగింది. ఈ విష‌యంపై బాలాజీ ఒక ప్ర‌క‌ట‌న చేస్తూ మ‌ల్లెల రాజేష్‌నాయుడు మాట‌లు వింటుంటే గురిగింజ సామెత గుర్తుకు వ‌స్తుంద‌ని, తాము బహిరంగ స‌భ‌ల‌కు జ‌నాన్ని త‌ర‌లించ‌టానికి ప‌డ్డ బాధ‌లు మ‌రిచి ఎదుటి పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఆయ‌న‌కే చెల్లించ‌ద‌న్నారు. వైఎస్సార్ సీపీ స‌భ‌ల‌కు జ‌నం వ‌స్తే అభిమానంతో వ‌చ్చిన‌ట్లా.. ప్ర‌తి ప‌క్ష పార్టీల‌కు ప్ర‌జ‌లు వ‌స్తే అది త‌ర‌లింపు అవుతుందా.. అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఈ రాక్షేస పాల‌న నుంచి ఎప్పుడు విమూక్తి పొందుదామా..? ఈ ప్ర‌భుత్వాన్ని ఎప్పుడు సాగ‌నంపుదామా అన్న క‌సితో ఉన్నార‌ని, వారిలో చెల‌రేగిన అంశాంతి, అందోళ‌న‌లు, ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త ప్ర‌తిప‌క్ష పార్టీల స‌భ‌ల విజ‌యానికి కార‌ణ‌మౌతున్నాయ‌న్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు వ‌స్తున్న ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసే రాష్ట్రంలో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల‌కు సైతం అనుమ‌తులు నిరాక‌రిస్తున్నార‌ని వెల్ల‌డించారు. టీడీపీ స‌భ‌ల‌కు సైతం అనుమ‌తులు నిరాక‌రిస్తూ, స‌భ వేదిక‌కు భూమి ఇచ్చిన రైతుల‌ను సైతం ఇబ్బందుల‌కు గురి చేస్తున్న విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అంద‌రికీ తెలుసన్నారు.
వాపును బ‌లుపు అనుకుంటే పొర‌పాటు అని మ‌ల్లెల రాజేష్‌నాయుడుకు హిత‌వు ప‌లికారు. స‌భ విజ‌య‌వంతం చేయ‌టానికి మందు, బిర్యాని, డ‌బ్బులు పంపిణీ చేశార‌ని, వివిద విభాగాల్ల ప‌నిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అశా, అంగ‌న్‌వాడీ ఇలా ప్ర‌తి ఒక్క‌రిని స‌భ‌కు రాక‌పోతే ఉద్యోగాలు పోతాయ‌ని, ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాలు దూరం చేస్తామ‌ని బెదిరించి స‌భ‌కు తర‌లించార‌ని ఆరోపించారు. చిలకలూరిపేటలో జరిగినటువంటి బస్సు యాత్ర గాని, మొన్న నరసరావుపేట పార్లమెంటు బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ యాదవ్ కు స్వాగతం పలకడానికి చిలకలూరిపేట సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు పడిన అగసాట్లు పార్టీలో ఏ చిన్న లీడ‌ర్‌ను అడిగినా చెబుతార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మాల‌కు జనాన్ని తరలించడానికి అన్ని గ్రామాలలో పనికి వెళ్లే కూలి వారిని డబ్బులు ఇచ్చి ఆటోల్లో త‌ర‌లించార‌ని, మున్సిపాలిటీలో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బందిని, వాలంటీర్స్ ని, వైన్ షాపుల్లో పనిచేసే సిబ్బందిని, రేషన్ డీలర్స్ ని బతిమిలాడుకొని డబ్బులు ఇచ్చి చిలకలూరిపేటలో ఉన్న ట్రావెల్స్ కార్లు ఇక్కడవే కాకుండా బయట నుంచి విజయవాడ గుంటూరు నుంచి కూడా డబ్బులు ఇచ్చి కార్లు పెట్టరైన వైనం మల్లెల రాజేష్ నాయుడు ది కాదా ప్ర‌శ్నించారు. ఇవన్నీ మర్చిపోయి స్వచ్ఛందంగా జనసేన పార్టీ బహిరంగ సభలకు వచ్చే జనాన్ని చూసి ఓర్వలేక జనసేన పార్టీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు.