అనంతపురం అర్బన్ మహిళలతో జనసేన మాటామంతి 34వ రోజు

  • ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదు
  • 21వ డివిజన్ అంబేద్కర్ నగర్ లో తీవ్ర మౌలిక సదుపాయాల కొరత
  • వైకాపాను గద్దె దింపుదాం అనంత నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం అర్బన్: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో గురువారం మాటామంతి కార్యక్రమంలో భాగంగా 34వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 21వ డివిజన్ అంబేద్కర్ నగర్ లో పర్యటించి స్థానిక మహిళలతో మమేకమయ్యి పలు సమస్యలు గుర్తించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఈ డివిజన్ లో పర్యటించి అరకొర రహదారులు మాత్రమే వేసి డివిజన్ మొత్తం అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నాడని కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులను చూసినట్లయితే అందుకు పూర్తి భిన్నంగా ఉందని సందులలో రోడ్లు సరిగాలేక మురుగు కాలువలు పూడిక తీయక మంచి నీరు సకాలంలో రాక స్థానిక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని జనసేన టీడీపీలకు ఓటు వేసి వైకాపాను గద్దె దించుదాం అనంత నగరాన్ని సుందర అనంతగా అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.