జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో డివిజన్ అధ్యక్షుడు సుంకర సురేష్ మరియు డివిజన్ కార్యదర్శి సాధనాల గంగాధర్ ఆధ్వర్యంలో స్థానిక 36వ డివిజన్ బాలాజీ చెరువు, టీటీడీ కళ్యాణ మండపం ప్రాంతంలో గ్రీన్ టాక్స్తో లారీ మరియు ఆటోలను చంపేస్తున్న జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ చాలామంది పేదలు మోటారు ఫీల్డులో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారనీ, ఇంకొంతమంది ప్రయివేటు ఫైనాన్స్ నుండీ అప్పులు తీసుకుని ఆటోలను, రవాణ వాహనాలను కొని తిప్పుతుంటారనీ ఇలాంటి బడుగు జీవులను స్వయం ఉపాధికి ప్రోత్సహించకుండా వారి నెత్తిన గ్రీన్ టాక్స్ అని చెప్పి వీరి రక్తాన్ని పీల్చే జలగలాగ పన్నులు వసూలు చేస్తున్న ఈ వై.సి.పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకేపన్నులు పెంచడానికి సిద్ధం అంటున్నాడని ప్రశ్నించారు. పోనీ గ్రీన్ టాక్స్ అని వసూలుచేస్తున్న డబ్బుతో మొక్కలు నాటే చిత్తశుద్ధిలేని వీళ్ళు తిరిగి ముఖ్యమంత్రి పర్యటన పేరు చెప్పి చెట్లు నరికేస్తున్న ప్రభుత్వం ఇదన్నారు. ఇలాంటి వీళ్ళకు గ్రీన్ టాక్స్ పేరుతో పన్ను వసూలుకి నైతిక అర్హతలేదని దునుమాడారు. ఇంక కేవలం సుమారు నలభై రోజులు మాత్రమే వీరికి సమయం ఉందనీ ఆతరువాత ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధం అని ప్రజలు అంటున్నారన్నారు. రాబోయే ఎన్నికలలో జనసేనపార్టీ తెలుగుదేశంల కూటమికి మద్దతు ఇవ్వమని స్థానిక ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిటి ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, చీకట్ల శ్రీనివాస్, నారాయణరావు, రాజేశ్వరి, పావని, తరుణ్, మావులూరి సురేష్, సతీష్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, పాలిక శివ, సుంకర రామక్రిష్ణ, సత్తిబాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.