గూడూరు చేరిన కోట్టేవారి వారాహిలు

గూడూరు, జనసేన కొట్టే ప్రచార రథాలు తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని దివిపాలెం వద్ద గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ కొట్టే వారి కార్ల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గూడూరు ఉమ్మడి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల కలయికను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. కొట్టేవారు తలపెట్టిన ఈ ప్రచార ర్యాలీ విజయవంతం కావాలని కోరుకుంటున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మా జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలిసి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పనిచేస్తాయని ప్రకటించి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వా హక కమిటీ రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్ర శేఖర్ రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొట్టే వారి కుటుంబాలను ఐక్యం చేసి జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కొట్టే ఉదయ భాస్కర్ ఎన్నారై సహకారంతో కొట్టే ఇంటి పేరు కలిగిన పలువు జనసేన పార్టీ నాయకులు కొణిదల వారి విజయం కొట్టే వారి లక్ష్యం అనే నినాదంతో 25 కార్లతో ప్రచారం కార్యక్రమం గూడూరు పట్టణం, చిల్లకూరు, కోట, వాకాడు, కోట మండలాల్లో నిర్వహించడంజరిగిందనితెలిపారు. ఈ కార్యక్రమంలో కొణిదెల వారి విజయం-కొట్టే వారి లక్ష్యం”. కొట్టే ఉదయభాస్కర్(ఎన్నారై) సహకారంతో జనసేన ప్రచార కార్యక్రమం నిర్వహకులు కొట్టే వెంకట్రావు (మచిలీపట్నం) కొట్టే సాయి(కాళహస్తి), కొట్టే అశ్వథ్ కుమార్(కదిరి), చిల్లా మహేష్ (కదిరి), మోహన్, ఇంద్రవర్ధన్, శివ, బాలు, సుధీర్, కార్తిక్, మహేష్, వంశీ, క్రాంతి, సాయి, శివ తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.