ఘనంగా అంజనేయులు, రాయుడు పుట్టినరోజు వేడుకలు

కళ్యాణదుర్గం నియోజకవర్గం: జనసేన పార్టీ బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు “అంజనేయులు” మరియు బ్రహ్మసముద్రం మండల ఉపాధ్యక్షులు & కళ్యాణదుర్గం నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ “రాయుడు” ఇద్దరి ఫూట్టినరోజు ఒకే రోజు కావడం విశేషం. వీరి ఫూట్టినరోజు కార్యక్రమం కళ్యాణదుర్గంలోని మన జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, నియోజకవర్గం స్పోక్ పర్సన్& మైనారిటీ హెడ్ సయ్యద్ మహబూబ్ పాషా, నియోజకవర్గ వీరమహిళలు షేక్ తార, మమత, కళ్యాణదుర్గం మండల అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, శెట్టూరు మండల అధ్యక్షులు కాంత్ రాజ్, కళ్యాణదుర్గం మండల ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, శెట్టూరు మండల ఉపాధ్యక్షులు రామలింగ, కంబదూరు మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కుందుర్పి మండల కార్యదర్శులు ఓబులరాజు, కళ్యాణదుర్గం మండల కమిటీ సభ్యులు అనిల్ పాల్యం, కార్తీక్, కళ్యాణదుర్గం నాయకులు సుధాకర్, చిత్తప్ప పాల్గొన్నారు.