పోలవరంలో విస్తృత స్థాయి సమావేశం

పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాలులో నియోజకవర్గ స్థాయి అత్యవసర సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఇంచార్జ్ బోరగం శ్రీనివాస్ మాట్లాడుతూ పోలవరం అసెంబ్లీ సీటు జనసేన చిర్రి బాలరాజుకి కేటాయించడం జరిగిందని ఈ సభా ముఖంగా అయన తెలియజేసారు. జనసేన-టీడీపీ కార్యకర్తలు అందరూ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి మన అధినాయకులకు బహుమతి ఇవ్వాలని సూచించారు. పోలవరం అభ్యర్థి విషయం లో జరిగే తప్పుడు ప్రచారాలని నమ్మవద్దని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సందర్బంగా పోలవరం నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ చిర్రి బాలరాజు ప్రసంగిస్తూ ఈ అత్యవసర సమావేశం అసెంబ్లీ అభ్యర్థి విషయంలో ప్రత్యర్థుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి అని అన్నారు. పోలవరం అసెంబ్లీ అభ్యర్థిపై వచ్చే తప్పుడు విష ప్రచారాలను నమ్మవద్దని, అధికార పార్టీ చేస్తున్న ఈ ప్రచారాలని జనసైనికులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తిప్పికొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలవరం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి 50 వేల నుండి 60 వేల భారీ మెజారిటీతో గెలిపించాలని తెలియజేసారు. ఈ సారి మనం కొట్టె దెబ్బకి వైసిపిపార్టీ 2029 ఎలక్షన్స్ లోకి రావాలంటే భయపడే విధంగా ఉండాలని అయన తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కారాటం సాయి గారు ప్రసంగిస్తూ పోలవరం నియోజకవర్గం అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించడం జరిగిందని. ఈరోజు జరిగిన ఐవిఆరెస్ కాల్ సర్వే తప్పుడు సమాచారాన్ని ఎవ్వరు నమ్మవద్దని ఒక్క ఓటమితో భూస్థాపితం అయిన పార్టీలు ఉన్నాయి. పదేళ్లుగా ఓటములను ఎదుర్కొంటూ అవమానాలను భరిస్తూ నిలబడ్డ ఏకైక పార్టీ జనసేన. మన ఆవేదన ఆవేశంతో కూడుకున్న ఆలోచనలతో నిర్ణయాలతో పార్టీని ఇబ్బంది పెట్టకండి. ప్రత్యర్ధుల కుట్రలను చేదిస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తన రెక్కల కష్టంతో పార్టీని నడిపిస్తున్న జనసేనుడికి అండగా నిలబడదాం. జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్ మాట్లాడుతూ ఇరు పార్టీ నాయకులు కార్యకర్తలు మనమందరం కలిసి ముందుకు వెళ్లాలని, మన ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. పోలవరం నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం శ్రేణులకు విజ్ఞప్తి! అసలు పోటీలో లేని అభ్యర్థుల పేరు మీద నకిలీ ఐవిఆరెస్ కాల్స్ వస్తున్నాయి. ఈ విషయం పై ఎవరూ ఆందోళన చెందవద్దు. మనకు ఇంతవరకు తెలియని అభ్యర్థుల పేరు మీద కాల్ వస్తే మీ నోటా కి నొక్కండి! అని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం టీడీపీ జనసేన ఏడు మండల నాయకులు, వీరమహిళలు, జనసైనికులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.