డేగల సంజీవరావుకు నివళులర్పించిన జనసేన నాయకులు

ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి డేగల లక్ష్మణ్ తండ్రి డేగల సంజీవరావు పెద్దకర్మ కార్యక్రమం వారి స్వగ్రామం 113 తాళ్లూరులో చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు పెంటేల బాలాజి, జిల్లా నాయకురాలు పాకానాటి రమాదేవి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. వీరితో పాటు జిల్లా సంయుక్త కార్యదర్శి జ్ఞాన మరియా జ్యోతి, జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట మల్లిక, పిరంగుపురం మండల ఉపాధ్యక్షురాలు అనురాధ, చిలకలూరిపేట పట్టణ నాయకులు అచ్చుకోలా అరుణ్ కుమార్, యడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మల్ల కోటి, ప్రధాన కార్యదర్శి బొందలపాటి సుబ్బారావు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.