మల్లాడి సత్యలింగ నాయకర్ కు జనసేన నివాళులు

కాకినాడ సిటి, మల్లాడి సత్యలింగ నాయకర్ వర్ధంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో దుగ్గన బాబ్జీ ఆధ్వర్యంలో జగన్నాధపురంలోని వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఎనభై సంవత్సరాల క్రితమే ఎంతో దూరదృష్టితో మల్లాడి సత్యలింగ నాయకర్ తాను వ్యాపారంలో సంపాదించిన ధనాన్ని పెద్ద ఎత్తున వెచ్చించి విద్యాసంస్థలని స్థాపించారనీ, దీనిద్వారా లక్షలాది మంది విద్యార్ధులు ప్రయోజకులయ్యారన్నారు. ఇంతటి గొప్ప ఆశయంతో ప్రజలకి సేవ చేసిన ఈమహనీయుడిని స్మరించుకోడం కాకినాడ వాసుల బాధ్యత అన్నారు. దురదృష్టవశాత్తూ గత పది సంవత్సరాలుగా స్థానిక రాజకీయనాయకులు నాయకర్ గొప్ప ఆశయంతో నెలకొల్పబడిన ఈ విద్యాసంస్థలని నిర్వీర్యం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయనాయకులు వీటిని ఆస్థులుగా తప్ప విద్యాలయాలుగా భావించకపోడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తంచేసారు. నాలుగు సంవత్సరాల క్రితం ఎం.ఎస్.ఎన్ నాయకర్ పి.జి సెంటర్ లో వై.సి.పి వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని పెట్టుకోడానికి ప్రయత్నించినపుడు జనసేనపార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన చేసి కోర్టుద్వారా ఎదుర్కున్న విషయం అందరికీ విదితమేనన్నారు. ఈ సంస్థ యొక్క భూములమీద రాజకీయనాయకులు వ్యాపారం చేస్తూ బతుకుతున్న విషయం గుర్తుచేసారు. జనసేన తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత ఎం.ఎస్.ఎన్ ఆస్తులని పరిరక్షించి సంస్థకు పూర్వవైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాబోయే జెండావందనాన్ని ఈప్రాంగణంలో జరిగేలా చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అదే తమ మొదటితీర్మానమన్నారు. తమ జనసేనపార్టీ ఎం.ఎస్.ఎన్ చార్టీస్ ను యూనివర్సిటీగా మార్చే విధంగా తీవ్ర కృషి చేస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, సిటి ఉపాధ్యక్షులు ఓలేటి రాము, సిటి ఆర్గనైజింగ్ శెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, వెంకటేశ్వరరావు, కొండమూరి గంగాధర్, వరదా దొరబాబు, సతీష్, తేజ, ఆకుల శ్రీనివాస్, ఓలేటి విజయ్ తదితరులు పాల్గొన్నారు.