ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి: పెండ్యాల శ్రీలత

అనంతపురం, జనసేన-టీడీపీ-బీజేపీ పార్టీల అంతిమ లక్ష్యం ఒక్కటే ఈ అవినీతి ప్రభుత్వన్ని గద్దె దించాలి, రాష్ట్ర ప్రజలకు సుపరి పాలన అందించాలి. ఈ లక్ష్యంతోనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పి అటువైపుగా అడుగులు వేసి ఈరోజు కూటమి ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారని జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ మహిళా కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత అన్నారు బుధవారం నాడు అనంతపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి పార్టీల మీడియా సమావేశంలో పాల్గొన్న శ్రీలత ఈ విధంగా మాట్లాడారు. ఈరోజు అన్ని పార్టీల లక్ష్యం ఒక్కటే అవినీతి పరున్ని, రాక్షసుణ్ణి అంతం చేయాలి. సంక్షేమం మాత్రమే అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి తోపుడు బండ్ల వారితో మొదలు పారిశ్రామిక వేత్తల వరకు అందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. మన రాష్ర్టంలో ఎక్కడ చూసినా అవినీతి అరాచకపాలనే నడిచింది ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలేదు కనుక మనం అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ విషయాలన్నీ గ్రహించి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ ల గెలుపుకోసం మేము జనసేన పార్టీ తరపున కృషి చేస్తామని తెలియజేసారు.