వారాహి యాత్ర విజయవంతం కోసం బొర్రా పాదయాత్ర

  • వారాహి యాత్ర పోస్టరును విడుదల చేసిన బొర్రా వెంకట అప్పారావు
  • సత్తెనపల్లి రూరల్ గ్రామంలో జనసేన పార్టీ జెండాలు ఆవిష్కరించిన బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి: జూన్ 14వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపైన పోరాటం చేయటం కోసం వారాహి యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఆ మహాకార్యం, ఆ ప్రజా సమస్యల పోరాట యాత్ర విజయవంతం కావాలని అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆయురారోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు తన సొంత ఊరిలోని పోలేరమ్మ తల్లి గుడి నుండి 4000 మంది జనసైనికుల సందోహంతో కలిసి కదం తొక్కుతూ పాదయాత్రగా బయలుదేరి భృగుబండలోని జగన్నాథ స్వామి ఆలయానికి చేరుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకుని పూజారులతో వేదమంత్రాలతో వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం కూడా జరిగింది. అనంతరం బృగుబండ గ్రామంలో ఆనాటి ప్రజారాజ్యంలో ఒక అభిమానిగా ప్రజారాజ్యం జెండా దిమ్మెను వెయ్యటం జరిగింది. మళ్ళీ అదే దిమ్మకి జనసేన హంగు ఏర్పాటు చేసి ఆ జెండాని ఎగరవేయడం జరిగినది, తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆరోజు ఒక అభిమానిగా ఈ జెండాను వేసి, మళ్లీ నా చేతుల మీదగా జనసేన జెండా వేయటం నా అదృష్టంగా భావిస్తున్నారని గుర్తు చేసుకున్నారు. కేవలం ఆ రోజుల్లో మేము ఒక అభిమానిగా పార్టీ కోసం పని చేసాము. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలోకి వచ్చి నియోజకవర్గంలో మొదటి విడతగా 20 గ్రామాల్లో జనసేన జెండా వేయటం కూడా జరిగినది. ఏ గ్రామానికి వెళ్లినా జనసైనికులు బ్రహ్మరథం పట్టి నన్ను ఆహ్వానించి పలు కార్యక్రమాలు నిర్వహించటం నాకు ఎంతో ఆనందంగా ఉందని బొర్రా వెంకట అప్పారావు చెప్పడం జరిగినది. నిస్వార్ధంగా కష్టపడుతున్న నియోజకవర్గ నాయకులు, జనసైనికులకి వారికి ఏ కష్టం వచ్చినా సరే తాను ఎల్లవేళలా అండగా ఉంటానని వారి యొక్క కష్టనష్టాల్లో తాను కూడా ఒక అన్నలాగా నిలబడతానని కార్యకర్తలకి నాయకులకి జనసైనికులకి సందేశం జరిగినది. జన సైనికులు ఉద్దేశించి మా సైనికులు మందు కోసమో, బిర్యానీ కోసం ఇంకెతరా ఇతర అవసరాల కోసం పనిచేసే కార్యకర్తలు కాదు. నిస్వార్ధంగా నమ్మి వచ్చిన నాయకుడికి అండగా ఉండి ఎన్నో విలువలు కలిగి ఉన్నటువంటి కార్యకర్తలు ఒక్క జనసేన పార్టీలో మాత్రమే ఉన్నారని ఇలాంటి కార్యకర్తలు, నాయకులతో కలిసి పని చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉందని జనసైనికులు ఉద్దేశించి మాట్లాడడం జరిగినది. ఈ కార్యక్రమం అనంతరం 5000 వేల మందికి భోజనం ఏర్పాట్లు చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మండల అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రోగ్రాం కమిటీ మెంబర్స్, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు, వీరమహిళలు, పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.