పవన్ కళ్యాణ్ తో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ సమావేశం

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డైరెక్టర్ (మార్కెటింగ్) శ్రీ వి. సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ బి. అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీలోని ఉప ముఖ్యమంత్రివారి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. తమ సంస్థ కార్యకలాపాలను ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అధికారులు వివరించారు. రాష్ట్రంలో సంస్ధ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు.