కరోనా కట్టడికి ఆంక్షలు తప్పవు: సీఎం అమరిందర్ సింగ్

దేశంలో కరోనా ఉదృతి మళ్ళీ మొదలైంది. మార్చి నెలలో చివరి పదిరోజులు భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. పది రోజుల్లో 5 లక్షలకు పైగా కేసులు 2359 కరోనా మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర తరువాత కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక పంజాబ్ లో 2452 కేసులు, 56 మరణాలు సంభవించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గకుంటే ఈనెల 8 వ తేదీన పరిస్థితిని సమీక్షించి కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇక 300 కేసుల కంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్న నగరాల్లో కరోనా వ్యాక్సిన్ పై అయన ఆగవాహన కలిపించారు. ప్రజలు వ్యాక్సిన్ తీసుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని కోరారు.