సరిహద్దుల్లో అంబులెన్స్‌లు ఆపొద్దు: హైకోర్టు

ఏపీ సరిహద్దుల వద్ద ఆ రాష్ట్ర అంబులెన్స్‌ల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్‌లు ఆపడం రాజ్యాంగ విరుద్ధమని తెలుసా అని తెలంగాణ సర్కార్ ను ప్రశ్నించింది. సర్క్యులర్‌, అడ్వైజరీ లేకుండా ఎలా నిలిపివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌లు ఆపొద్దని పోలీసులను ఆదేశించింది.

ఆర్టికల్ 14,19 1(డీ) ప్రకారం అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులను నిలిపి వేసి ఉల్లంఘనకు ప్రభుత్వం పాల్పడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.