మద్యం షాపు టెండర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల..

అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని నడిపించాలంటే ప్రభుత్వానికి రెండే మార్గాలు కనిపిస్తున్నట్టు ఉంది. ఒకటి భూముల అమ్మకం.. మరొకటి మద్యం అమ్మకం. ఓవైపు భూముల అమ్మకాలు కొనసాగుతుండగా.. ఇంకోవైపు రోజురోజుకీ మద్యం సేల్స్‌ రికార్డులు క్రియేట్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మద్యం షాపుల టెండర్లకు షెడ్యూల్‌ ను విడుదల చేసింది ప్రభుత్వం. ఈనెల 10 నుంచి 18 వరకు టెండర్లు ఉంటాయని దీనికోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.

అక్టోబర్ నెలలోనే ఎక్సైజ్ పాలసీ ముగిసింది. కరోనా కారణంగా గడువును పొడిగించారు అధికారులు. అయితే తాజాగా 2021-23 టెండర్ల షెడ్యూల్ ను ప్రకటించారు. నాన్‌ రిఫండబుల్‌ అమౌంట్‌ గా రూ.2 లక్షలు చెల్లించాల‌ని నిర్ణయించారు. అలాగే మద్యం షాపుల లాటరీ ఈ నెల 20న ఉంటుందని చెప్పారు అధికారులు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం షాపులు ఉన్నాయి. ఈసంఖ్యను ఇంకో పది శాతం పెంచాలని ప్రభుత్వం చూస్తున్నట్లుగా సమాచారం. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కూడా ఉంటాయని తెలుస్తోంది.