Vijayanagaram: రైతులకు న్యాయం చెయ్యకపోతే పోరాటం తప్పదు

విజయనగరం జిల్లా, సీతానగరం మండలం లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ వద్ద బకాయిలు చెల్లించాలని రైతులు చేస్తున్న రిలే నిరాహారదీక్షకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు మరియు జనసేన నాయకులు సంఘీభావంగా వారికి అండగా నిలబడి మద్దతు తెలపడం జరిగింది, ప్రభుత్వం ప్రకటించిన తేదీలోగా రైతులకు న్యాయం చెయ్యకపోతే జనసేన పార్టీ తరపున పోరాటం తప్పదు అని అదే విధంగా చుట్టు పక్కల ప్రాంతాలలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలలో క్రస్సింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు కానీ లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీలో ఆ ప్రక్రియ సూన్యం, ఇప్పటికే పంట వేసి వేచి చూస్తున్న రైతులు పరిస్థితి ఏంటి దీనికి ఫ్యాక్టరీ యాజమాన్యం మరియు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.