బత్తుల ఆధ్వర్యంలో ఆరెంజ్ రీరిలీజ్ సంబరాలు

రాజానగరం, మార్చ్ 27న తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరింపచేసి ప్రపంచం ముందు తెలుగు వాడిని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన మెగాస్టార్ చిరంజీవి ముద్దుబిడ్డ గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ జన్మదినం సందర్భంగా శనివారం రాజానగరంలో ఉన్న ఫార్చ్యూన్ 4 థియేటర్లో రామచరణ్ నటించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ “ఆరెంజ్” సినిమాని శనివారం మరియు ఆదివారం (25, 26) ప్రదర్శించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ ఏర్పాటుచేశారు. అభిమానులు, జనసేన నాయకులు, జనసైనికుల కోలాహలం నడుమ బత్తుల వెంకటలక్ష్మి కేక్ ను కట్ చేసి రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం అక్కడ ఉన్న నాయకులు మరియు అభిమానులతో కలిసి సినిమాని వీక్షించారు. ఈ వేడుకలలో కిమిడి శ్రీరామ్, గుల్లింకుల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, కురుమెళ్ళ మహేష్, అడబాల ఆదివిష్ణు, గంగిశెట్టి రాజేంద్ర, ఆనందేవుల సూరిబాబు, అడ్డాల శివ, నాతిపం దొరబాబు, రామకృష్ణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.