మసీదుల పునర్నిర్మాణ విషయం చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ను కలవనున్నఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీ కానున్నారు. కొత్త సచివాలయం నిర్మాణం కోసం పాత సచివాలయ భవనాలను కూల్చినప్పుడు అక్కడి రెండు మసీదులను సైతం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మసీదుల పునర్నిర్మాణం విషయం చర్చించేందుకు ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, ఇతర ముస్లిం సంస్థల ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలుస్తున్నట్టు అసదుద్దీన్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు.

తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సమయంలో అక్కడున్న దేవాలయం, మసీదులు దెబ్బతిన్నాయి. ఈ విషయంపై సీఎం కేసీఆర్ సైతం విచారం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని గతంలోనే సీఎం ప్రకటించారు. దేవాలయం, మసీదు నిర్వాహకులతో సీఎం త్వరలోనే సమావేశమవుతానని అప్పట్లో హామీ ఇచ్చారు.