అగ్నికి ఆహుతైన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రల్లో ఒకటైన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ రథం అగ్నికి ఆహుతయ్యింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగినట్లు సమాచారం. ప్రతి సంవత్సరం కల్యాణోత్సవంలో ఉత్సవమూర్తులను రథంపై ఉంచి ఊరేగిస్తారు. ఊరేగించిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో భద్రపరుస్తారు. రాత్రి అకస్మాత్తుగా మంటలు అంటుకొని రథం దగ్ధం అయింది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా కావాలని చేశారా అనే కోణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. 40 అడుగుల ఎత్తైన ఈ రథాన్ని 60 ఏళ్ల కిందట తయారు చేశారు.