కబాడీతో కరోనా రాదని వైసిపి ప్రకటించగలదా..?

కబాడీ ఆడాలి. కానీ… ఇది కరోనా కాలం… సరైన సమయం కాదు…
జిల్లా కలెక్టర్ లక్ష కేసులున్నాయని గతవారం ప్రకటించారు. తెలిసి కూడా పాలకులకు ఎందుకింత నిర్లక్ష్యం…?
కబడ్డీ పోటీలకు విరాళాలు ఇచ్చిన వ్యాపార విభాగాలు రోడ్ల మరమ్మతులకు కూడా సహకరించండి.
మీరు గ్రౌండ్లో కబడ్డీ కబడ్డీ అంటే నగరంలో కరోనా విజృంభ మోత(కేక) మోగుతుంది.
కబడ్డీ పోటీలు ముగిసిన వెంటనే కరోనా కేసులు ఉదృతం అవుతాయి.
సీఎం జిల్లాకు ఖ్యాతి కల్పించేందుకే అన్నమయ్య ఘాట్ రోడ్డును ఎంచుకున్నారు.
మూడో ఘాట్ రోడ్డు ఆలోచనలను విరమించుకోని పక్షంలో కోర్టులో కేసు వేస్తాo

గత సుమారు మూడు సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న covid-19 మొదటి, రెండవ దశలను దాటి ఓమైక్రాన్ రూపంలో మూడవ దశలోకి అడుగుపెట్టి థర్డ్ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంటే ఈ ప్రమాదకరమైన సమయంలో తిరుపతికి పేరు తీసుకోస్తామని జాతీయ కబడ్డీ పోటీలను మున్సిపల్ కార్పోరేషన్, వైసిపి అధిష్ఠానం కలిసి తలపెట్టిన నేషనల్ కబడి ఆటలతో, కరోనాను దేశవ్యాప్తంగా అంటించే తప్పిదం చేస్తున్నారని… అలాగే సీఎం జగన్ సొంత జిల్లా కడప ప్రాచుర్యం కోసం కుక్కలదొడ్డి వద్ద ఉన్న అన్నమయ్య నడక దారిని తిరుమలకు మూడవ ఘాట్రోడ్డుగా నిర్మించేందుకు సన్నాహాలు చేయడం తిరుమల శ్రీవారి ఆలయ భద్రతకు భంగం కలుగుతుందని, జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, సిటీ అధ్యక్షులు రాజారెడ్డి జిల్లా కార్యదర్శి రాజేష్ యాదవ్, హేమకుమార్, జనసేన నాయకులు బాబ్జి, మీడియా ఇంచార్జ్ సుమన్, మునిస్వామి, లతా, అమృతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రెస్క్లబ్ లో బుధవారం మీడియాతో వీరు మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం ఓమైక్రాన్ భయంతో మూడవ లాక్డౌన్ ను ప్రకటిస్తూ.. ప్రజల ప్రాణాల్ని కాపాడుకోవాలని ఆందోళన చెందుతుంటే, ప్రపంచంలోనే స్మార్ట్ సిటీగా పేరున్న, తిరుమల శ్రీవారి ఆలయ ఆధ్యాత్మిక గుర్తింపు ఉన్న ఇంత ప్రతిష్టతను పక్కన పెట్టి తిరుపతిని కబడ్డీతో ఎక్కడికో తీసుకెళ్లాలన్నా అవివేకంతో కరోనాకు జన ప్రాణాలను పణంగా పెట్టి బలి చేయాలన్న అవివేక పాలనను సాగిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ సంఘటనపై కరోనా విజృంభించదని వైసిపి ప్రకటించగలదా..? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రాంతం కడప జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకోవడానికి.. కుక్కల దొడ్డి నుండి తిరుమలకు మూడవ ఘాట్రోడ్ ప్లాన్ను టిటిడి చైర్మన్ జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి ప్లాన్ చేస్తున్నారని… దీనివలన తిరుపతి ప్రాచుర్యం తగ్గి హైదరాబాద్, చెన్నై, విజయవాడ ప్రాంతాల నుండి తిరుమలకు రాకపోకలను ఈ అన్నమయ్య మార్గాన్ని కొనసాగిస్తారని… దీనివలన తిరుపతి, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, అప్పలాయగుంట తదితర లోకల్ టెంపుల్స్ ఖ్యాతి తగ్గి అధోగతి పాలు అవుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడవ మార్గo ఆలోచనలను తక్షణం విరమించకుంటే, కోర్టుకెళ్లి అయినా శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు దారులతో అరిష్టం అని తెలియజేసి వైకాపా ఆలోచననకు చరమగీతం
పాడిస్తామని హెచ్చరించారు.