గుడ్ ఫ్రైడే ప్రార్ధనలో జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలం, కాకర్ల గ్రామంలో గుడ్ ఫ్రైడే సందర్బంగా చర్చిలో ఫాదర్ ప్రసన్న కుమార్ ప్రార్థనా కార్యక్రమలు నిర్వహించారు. అనంతరం ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య మాట్లాడుతూ.. కాకర్ల గ్రామంలో ప్రజలు ఉపవాసం దీక్ష చేస్తున్న ప్రతి ఒక్కరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. తోటివారి పట్ల ప్రేమను, కరుణను ప్రజలందరూ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి లంకా నరసింహా రావు, కాకర్ల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.