పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండల కమిటీ సమావేశం

చిత్తూరు, జనసేన పార్టీ పిఏసి సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నా రాయల్, కార్యదర్శులు పగడాల రమణ, జావిద్ భాష ల అధ్యక్షతన మండల అధ్యక్షులు రెడ్డి శేఖర్ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీనీ ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శి చిన్నా రాయల్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే విధంగా నాయకులు ఉండాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనినవారు రొంపిచర్ల మండల కమిటీ సభ్యులు, పుంగనూరు మండల రూరల్ అధ్యక్షులు విరూపాక్షీ, జనసేన కార్యకర్తలు చైతన్య, చంద్ర, హరి నాయక్ మరియు తదితరులు.