ఛలో నరసాపురం జనసేన పార్టీ అమలాపురం

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మత్స్యకార అభ్యున్నతి సభకు అమలాపురం నియోజకవర్గం నుండి నల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో జనసైనికులు బయలు దేరి వెళ్లారు. అమలాపురం శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి గుడి వద్ద నుండి 54 కార్లతో భారీ ర్యాలీగా మత్స్యకార సభకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల నాగ సతీష్, జనసేన మండలాధ్యక్షులు లింగోలు పండు, అమలాపురం రూరల్ జనసేన అధ్యక్షుడు ఆకుల సూర్యనారాయణ మూర్తి, దళిత నాయకులు ఇసుకపట్ల రఘుబాబు , అయితాబత్తుల ఉమ, ఉండ్రు భగవాన్ దాస్, పరమట చిట్టిబాబు, అమలాపురం మున్సిపల్ ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను, కౌన్సిలర్లు పడాల శ్రీదేవి నానాజీ, తిక్కా సత్య లక్ష్మి ప్రసాద్, గొలకోటి విజయలక్ష్మి వాసు, రాష్ట్ర నాయకులు కొప్పుల నాగమానస, బట్టు పండు, పోలిశెట్టి బాబులు, వాకపల్లి శ్రీను, బండారు వెంకట కోటేశ్వరరావు, తిక్కా యశ్వంత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.