నీలి పార్టీ, దాని నీలి మీడియా మరలా విషప్రచారం మొదలు పెట్టింది: మొగిలి అప్పారావు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక్క విషయం మాత్రం సుస్పష్టంగా చెప్పటం జరిగింది. అదేమిటంటే రాబోయే ప్రభుత్వం జనసేన పార్టీదే, నేనే ముఖ్యమంత్రి అని. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన వేసుకున్న ప్రణాళికలు రూపమాత్రంగా వివరించారు.

రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు స్వస్తి చెప్పాలనటం ద్వారా నూతన ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకి సహకారం అందించమనటం ద్వారా తెదేపాతో పోత్తు అనే అంశం పూర్తిగా తుడిచేయటం జరిగింది. నూతన ప్రజా ప్రభుత్వం అంటే, జనసేన పార్టీ సారథ్యంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం అని స్పష్టమైన ప్రకటన చేయటమే.

ఇది అర్ధం అయినా కూడా, కావాలని నీలి పార్టీ, దాని నీలి మీడియా మరలా విషప్రచారం మొదలు పెట్టారు. జనసేన-తెదేపా కలుస్తాయని.. వారు సౌకర్యంగా మరచి పోయినదేమిటంటే, భాజపా ఇచ్చే భవిష్యత్తు ప్రణాళిక బట్టి 2024లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరుగుతుంది అని. ఇక్కడ భాజపా ఖచ్చితంగా తెదేపాతో పోత్తు అంగీకరించటం జరగదు.

ఇంత విస్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా శునకానందం పోందే అశుథ్థం అబగా తినే ఛానళ్ళు పిచ్చి పిచ్చి కథనాలు వండివారుస్తూన్నాయి. కానీ ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. వారికి స్పష్టంగా అర్ధం అవుతుంది.