రాజమండ్రిలో జనంలోకి జనసేన కార్యక్రమం ప్రారంభించిన అనుశ్రీ

రాజమండ్రి, స్థానిక 36, 38వ డివిజన్లలో తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి అర్బన్ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొని ప్రతి ఇంటికి జనసేన మేనిఫెస్టోను ప్రచారం చేయడం జరిగినది. జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు నా సేన కోసం నా వంతుగా పార్టీకి విరాళాలు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది కౌలు రైతులు మరణానికి చలించిన పవన్ కళ్యాణ్ 30 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ తరఫున అందించడం ప్రజలపై ఆయనకున్న ప్రేమకు నిదర్శనం అని రాబోయే రోజుల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని సీఎం గా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకుంటున్నారని అనుశ్రీ తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా పలువురుని అనుశ్రీ, జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అడ్డగర్ల చిన్నారి, కర్రి రాజు, సాయిరాం, బాసరమణి దుర్గ ప్రసాద్ ల ఆధ్వర్యంలో పలువురు మహిళలు అనుశ్రీకి ఘన స్వాగతం పలికారు. వార్డు పర్యటనలో అడుగడుగున హారతులతో అనుశ్రీకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పొన్నాడ శ్రీను రాజమండ్రి సిటీ ఉపాధ్యక్షులు గుత్తుల బుల్లి, ప్రధాన కార్యదర్శులు పైడిరాజు, నల్లంశెట్టి వీరబాబు, నగర కార్యదర్శులు అల్లాటి రాజు, విన్న వాసు, గుణ్ణం శ్యాంసుందర్, సంయుక్త కార్యదర్శులు చక్రపాణి, వేణు, నగర జనసేన యువ నాయకులు సూర్య, ఖన్నా, నర్సిపూడి రాంబాబు, ప్రవీణ్, స్థానిక నాయకులు, కుంది రాము, ఆటో రాజు, నంగిన శ్రీను, కొన్ని సూర్య, బాసిన కోటేశ్వరరావు, కొండపల్లి సురేష్, ఎలక్ట్రీషియన్ శివ, బొడ్డపు స్వామి, నాయకండి గోవింద్, గొడ్డి కోటేశ్వరరావు, సిమెంట్ వీరబాబు, సంతోష్, కోట, శ్రీను, సత్యనారాయణ, గ్యాస్ అప్పారావు, మూర్తి, వడశ్రీను, యేసు, స్వామి, సంతోష్, డేరింగ్ దుర్గ, సాయి, డి.రాజు, బాల, నంగిన లోవరాజు తదితరులు పాల్గొన్నారు.