జనసేన నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన పిల్లా దినేష్

పిఠాపురం, భారతీయుడైన ప్రతీ పౌరుడు పొందే ప్రాథమిక హక్కులు కూడు, గూడు, విద్య మరియు వైద్యం. నేటి లోపభూయిష్టమైన వ్యవస్థలలో వాటిని పౌరహక్కుగా పొందాలి అంటే కచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికెట్ సమర్పించవలసిన పరిస్థితి తప్పనిసరి. 75 సంవత్సరముల స్వతంత్ర భారతావనిలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం క్యాస్ట్ సర్టిఫికెట్ లేకుండా రెండున్నర లక్షల నుండి మూడు లక్షల ఓటింగ్ కలిగిన ఒక జాతి మొత్తం మిగిలి పోయింది అంటే నమ్ముతారా. ఇది సత్యం బేడ బుడగ జంగం అని పిలవబడే సంచార జాతి తెగ అయిన ఆంధ్ర ప్రజలు క్యాస్ట్ సర్టిఫికెట్ లేక అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హులైన నిర్భాగ్యులే అయినా కనీస ప్రభుత్వ సౌకర్యాలను కూడా పొందలేని స్థితిలో పట్టించుకునే నాథుడు లేక దిక్కుతోచని స్థితిలో అభాగ్యులకు అండగా నిలిచే జనసేన పార్టీ ఒక వేకువ కిరణంలా కనిపించడంతో తమ మొర ఈ ప్రభుత్వాలు వినిపించుకోవాలి అంటే జనసేన పార్టీ ఏ దిక్కు అని తలచి జిల్లాకు విచ్చేసిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని జిల్లా అధ్యక్షులు, కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో కలసి తమ గోడును పవన్ కళ్యాణ్ కి తెలిసేలా చెప్పమని తద్వారా ఈ ప్రభుత్వంలో చలనం తీసుకురావాలని కోరుకుంటూ తమ వినతిపత్రాలు మన మోటూరి మహేష్, కళ్యాణం దుర్గా ప్రసాద్ లు
కందరడా ఎంపీటీసీ పిల్లా సునీత (దినేష్), మకీనీడ్ శేషుకుమారి, వెన్నా జగదీష్, జిల్లా అధికార ప్రతినిధి తోలేటి శిరీష, జనసేన పిఠాపురం మండల నాయకులు గఒధి గోవిందరాజులు, రామిశెట్టి సూరి, శివ మంగతుర్తి, పిల్లా లోవరాజు సమర్పించుకున్నారు. జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ని, ఇతర ఇంచార్జ్ లను పిల్లా వెంకట దినేష్ మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది.