విద్యార్ధులకు సహకరించాలని డిఎం కి లేఖ

శ్రీకాకుళం జిల్లా, గార మండలం, శ్రీకాకుళం జిల్లా భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ కాకర్ల బాబాజీ శ్రీకాకుళం ఏపిఎస్ ఆర్టీసి డిఎం ని కలిసి గార మండలం కొర్ని కొర్లాం, కొమరివానిపేట పంచాయతీ విద్యార్థులు, చదువుకోవడానికి శ్రీకాకుళం కాలేజ్ లకు రావడానికి రవాణా సౌకర్యాం, ఒక బస్ ఉండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని… ఎందుకంటే కాలేజ్ లకు వస్తున్నప్పటికీ కాలేజ్ సమయం దాటి సుమారు 30, 40 నిమిషాలు లేటు అవ్వడంతో కాలేజ్ ప్రిన్సిపల్ కాలేజ్ లోకి పంపించడం లేదు. అలాగే ఆ టైంలో వస్తున్న ఒకే ఒక్క బస్సు వల్ల విద్యార్థులు తన ప్రాణాలను పణంగా పెట్టి ఫుట్పాత్ మీద నిలబడుతూ బస్సుకు వేలాడుతూ ప్రయాణం చేయడం జరుగుతుందని దీనివల్ల విద్యార్థులు ప్రాణాలు రక్షణ కరువవుతుందని డిఎం కి లేఖ ద్వారా బాబాజీ వివరించడం జరిగింది. అలాగే ఆ టైం కి వస్తున్న పల్లె వెలుగుల బస్ టైమింగ్ మార్చాలని డిఎం ని కోరడం జరిగింది. అలాగే విద్యార్థుల కోసం స్టూడెంట్ స్పెషల్ బస్ గార వరకు వస్తున్న బస్ ను… కొర్ని కోల్లంకి ప్రతి రోజు పంపించాలని బాబాజీ కోరారు. ఈ కార్యక్రమంలో విక్కీ, రామారాజు స్టూడెంట్స్ పాల్గొన్నారు.