జనసేన తరపున తగు సహాయం చేస్తాం

విశాఖ జిల్లా, చోడవరం నియోజకవర్గం, ద్వారకానగర్ కాలనీ నందు 50 సంవత్సరాలకు ముందు నుండి ప్రభుత్వ స్థలములో సుమారు 300 నిరుపేద కుటుంబాలు నివాసం ఏర్పరుచుకొని జీవనం సాగిస్తూ ఎన్నో ఏళ్లగా ఇళ్ల పట్టాలు కోసం అధికారులను, ప్రజా ప్రజాప్రతినిధులను వేడుకొంటూ వస్తున్నారు. వీరికి పట్టాలు ఇస్తామని మోసపూరిత వాగ్దానములు ఇస్తూ రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు ప్రతి ఎన్నికల్లో వీరిని ఓటుబ్యాంక్ రాజకీయాలకు వాడుకొంటూ వస్తున్నారు. 20 ఏకారముల భూమిపై భూ రాబందుల కళ్ళు పడి ఈ భూమి ప్రయివేట్ స్థలమని పలు కేసులు కోర్టులనందు వేస్తూ వీరిని వేధిస్తున్నారు . రెవిన్యూ వారితో కలసి ఈ స్థలమును కబ్జా చెయ్యడానికి దౌర్జన్యంగా భూమిని ఆక్రమిస్తున్నారు. ఈ స్థలములో గతములో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొరకు గతంలో రెండు భావనములను కట్టియున్నారు అలాగే సిమెంట్ రోడ్ మరియు అన్ని ఇళ్లకు కరెంట్, మంచినీరు సదుపాయము ప్రభుత్వము కల్పించింది. అలాగే రెండు స్మశానములు ఒక డంపింగ్ యార్డ్ కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు అకస్మాత్తుగా ఇది ప్రైవేట్ భూమి అని కొందరు కబ్జాదారులు వస్తే వారిని ప్రభుత్వం నిరోధించకుండా ఉండడం అలాగే స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా వారికే వంతపాడడం వలన సదరు నిరుపేదలు తీవ్ర మానసిక వేదనతో ఉన్నారు. నియోజకవర్గ జనసేన ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు వారిని కలసి ఎట్టి పరిస్థిల్లో వారిని ఇక్కడనుండి కదలకుండా చూసి పేదలకు న్యాయం చేస్తామని అవసరమయితే పార్టీ తరపున న్యాయ పోరాటం కోసం అవసరమగు సహాయం చేస్తామని ఎవ్వరి బెదిరింపులకు భయపడవద్దని వారికి అండగా జనసేన ఉంటుందని కాలనీ అంతా పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గూనూరు మూలునాయుడు, మైచర్ల నాయుడు, బలిజ మహారాజు చోడవరం టౌన్ అధ్యక్షులు కర్రి రమేష్, వీరమహిళా అధ్యక్షురాలు ఎన్ రమాదేవి ముఖ్య నాయకులు గంగునాయిడు ఎన్.వి.కె కుమార్, టి రమేష్, మంగా శ్రీను, యడ్ల రామమూర్తి, భూషణం, పిల్లా అప్పల నాయుడు సిహెచ్ కిషోర్, బిఎల్ శివ తదితర నాయకులు పాల్గొన్నారు.