“పోవాలి జగన్ – రావాలి పవన్” పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

  • జగన్ రెడ్డి మూడేళ్ల పాలనపై ప్రజా అభిప్రాయం, పోవాలి జగన్ – రావాలి పవన్..
  • రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ ను పంపే ఆలోచనలో జనం.
  • కష్టాల్లో ఉన్న జనాన్ని ఆదరిస్తున్న పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్న జనం.

తిరుపతి, ఒక్క ఛాన్స్ అంటూ మూడేళ్లుగా రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుతిన్న వైకాపా ను సాగనంపాలని జనం నిర్ణయించుకున్నారని, ప్రజల కష్టాలను చూసి ఆయన సొంత నిధులతో ఎన్నో సందర్భాలలో ఆదుకుంటున్న తమ జనసేనాని ని ఆంధ్రప్రదేశ్ పాలకునిగా, ప్రజలు మనసులో రావాలని కోరుకుంటున్నారని, జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జి కిరణ్ రాయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియాతో జనసేన నేతలు నగర అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, హేమ కుమార్, సుమన్ బాబు, మనోజ్, కిషోర్ తదితరులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ పాదయాత్రలో ఒక్క అవకాశం అని అడిగిన జగన్ ను జనం సీఎం చేస్తే రాష్ట్రాన్ని పూర్తిగా సంకనాకిచ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుల స్థలంలో రాత్రికి రాత్రి షెడ్డు వేసి కబ్జా చేస్తున్న వైసీపీ ప్రబుద్ధుల కు ఓటర్లు భయపడి పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారని కొనియాడారు. తమ అధినేత పవన్ కు భయపడి బస్సు యాత్ర చేస్తున్న ప్రజా ప్రతినిధులను జనం తరుముతున్నారని, హెలికాప్టర్ లో వచ్చినా రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. వైకాపాకు గతంలో వచ్చిన 151 సీట్లు రివర్స్ అవుతాయని జోస్యం చెప్పారు, నూటికి నూరు శాతం ప్రజలు తమ పవన్ కళ్యాణ్ కు 2024లో అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.