వైసీపీ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల నివారణలో విఫలం అయింది: గుంతకల్ జనసేన

గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన “కౌలురైతు భరోసా” యాత్రను క్షేత్రస్థాయిలో తెలియజేయడానికి టీమ్ పిడికిలి వారు తయారు చేయించిన గోడపత్రికలను గుంతకల్ పట్టణం 60 అడుగుల రోడ్డు జనసేన పార్టీ కార్యాలయంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మరియు సంయుక్త కార్యదర్శి ఆరికేరి జీవన్ కుమార్ సమక్షంలో ఆవిష్కరించి తర్వాత వివిధ కూడలిలోను మరియు ఆటోలకు అతికించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ జనసేన కౌలురైతు భరోసా యాత్రలో మా అధినేత ప్రపంచానికి తెలియజేసి ఆదుకున్న రైతుల్లో ఏ ఒకరైన ఆత్మహత్య చేసుకోలేదు అని నిరూపించే దమ్ము మీకు ఉందా అని సిబిఐ దత్తపుత్రుడుకి సవాల్ విసిరారు. అసలు జనసేన పార్టీ రైతులను ఆదుకోవడం ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇష్టం లేదు మాకు అర్థం కావడం లేదు, ప్రభుత్వం సహాయం చెయ్యదు, మమ్మల్ని సహాయం చేయనివ్వరు అని ప్రశ్నించారు. జనసేన లక్ష్యం ఒకటే అన్నం పెట్టే రైతన్న రాజు కావాలనే ఆలోచన తో రైతులకు మద్దతుగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర ఏర్పాటు చేశారు, అలాంటి నాయకుడి ఆశయ సాధనలో భాగం అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, సోహెల్ జనసైనికులు, నాయకులు బోయ సురేష్, పాండు కుమార్, హెన్రిపాల్, విజయ్ కుమార్, బోయ వీరేష్, జిలాన్, ఆటో రామకృష్ణ, రమేష్ రాజ్, రాజు, వెంకటేష్, సత్తి, రాజు తదితరులు పాల్గొన్నారు.