గంజాయ్ ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రన్ని మార్చేసారు: పసుపులేటి హరిప్రసాద్

మనదేశంలో ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుబడినా అది ఆంద్రప్రదేశ్ నుండే వచ్చిందని పోలీసులు పసిగట్టే విధంగా మన ఏపీ ను గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు. ఆనాడు అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటిస్తే నేడు మన సీఎం జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ వైసిపి నేతలు వ్యాపారాలు చేసుకునేందుకు గంజాయ్ ని ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని గంజాయ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారని ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు జనసేనపార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల, నాయకులు రాజారెడ్డి, బత్తెన మధుబాబు, రాజేష్ యాదవ్, సుమన్, అమృత, మునిస్వామి, చిన్నా రాయల్, ఆనంద్ లతో కలిసి మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ దేశంలో పట్టుబడుతున్న గంజాయి మన రాష్ట్రం నుంచే సరఫరా అవుతున్నట్లు, దీనిని మన పాలకులే ప్రోత్సహించడం బాధాకరమని ట్విట్టర్ లో పోస్ట్ చేశారని తెలిపారు, డ్రగ్స్ కి కేరాఫ్ అడ్రస్ నైజీరియా అని గంజాయికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పుకునే మన దేశం గంజాయి బౌల్ ఆఫ్ ఇండియా గా మార్చేశారని విమర్శించారు. గతంలో మారుమూల ప్రాంతాలలో గంజాయిని పండించి సీక్రెట్ గా విక్రయించే వారని నేడు పాలకులే గంజాయిని పండించి వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని నవరత్నాల పథకాలకు మళ్లించి దళితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. గత ఎలక్షన్లో ప్రజాప్రతినిధులు ఓటుకు నోటుగా ఖర్చుచేసిన సొమ్మును రాబట్టుకోవడానికే మాదకద్రవ్యాల వ్యాపారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాబోయే ఎలక్షన్ లో మరోసారి పాలనలోకి రావడానికి వైసిపి నాయకులు ధనార్జనే ధ్యేయంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ఎదుర్కోవాలంటే యువత నడుం బిగించి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు.