మనోజ్ కుమార్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు

జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ను పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మనోజ్ కుమార్ చేస్తున్న పలు పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా.. జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ద్వారా.. మరియు జిల్లా కార్యదర్శి మేడా రమేష్ నాయుడు ద్వారా.. తెలుసుకున్న పవన్ కళ్యాణ్ మనోజ్ కుమార్ ను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మనోజ్ కుమార్ లాంటి యువకులు జనసేన పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు అని అభినందించారు.