చించినాడ జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం, 49 రోజులు పూర్తి

పశ్చిమ గోదావరి జీల్లా, చించినాడ బ్రిడ్జ్ సమీపంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 49 రోజులుగా ప్రయాణికులకు, బాటసారులకు, యాచకులకు మరియు ప్రజలకు దాహార్తి తీర్చడానికి జనసేన పార్టీ తరుపున మజ్జిగ అందజేయడం జరుగుతుంది. గత నెలలో ప్రారంభించిన ఈ చలివేంద్రం (మజ్జిగ) ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ రోజుకి 49 రోజులు పూర్తి చేసుకోవడం జరిగిందని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చించినాడ జనసేన నాయకులు రేపూరి శ్రీనివాస్ తెలిపారు. ఈ వేసవిలో ఎండను సైతం లేక్కచేయకుండా జనసైనికులు చలివేంద్రం ద్వారా మజ్జిగను ఇవ్వడంపై ప్రజలు హర్షము వ్యక్తం చేస్తున్నారు.