ఈ వైసీపీ ప్రభుత్వంలో బెల్లం అమ్మటం కూడా నేరమేనా

పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం గ్రామంలో స్థానిక వ్యాపారి ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. సంకా రమణ అనే పచారి వ్యాపారం బెల్లం అమ్మడు అని, ఆ బెల్లంతో కాపుసారా కాసారని అభియోగంతో ఆ వ్యాపారిని పోలీసులు విచారణ చేశారు. దానితో కలత చెందిన వ్యాపారి ఉప్పుటేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంకా రమణ కుటుంబాన్ని జనసేన పార్టీ నుండి పరామర్శించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ప్రగాఢ సానుభూతి తెలియజేయడమైనది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనె. రెండు కిలోల బెల్లానికి ఇంత రాద్ధాంతం అవసరమా? పెడన నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అక్రమ ఇసుక దందా జరుగుతున్నా పట్టించుకోని అధికారులు, రెండు కిలోల బెల్లం విషయంలో ఇంత సీరియస్ విచారణ చేయడం హాస్యాస్పదంగా ఉంది. కాపుసారా కాయటం నేరం, అలాంటి కాపుసారాను కచ్చితంగా అడ్డుకట్ట వేయవలసిందే. ఇప్పటివరకు కాపు సారాపై ఎన్ని కేసులు పెట్టారు ఎంత మందిని శిక్షించారో కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రు జోగి రమేష్ నియోజకవర్గంలో ఇలాంటి ఘోర సంఘటన జరిగినప్పటికీ కనీసం నోరు విప్పక పోవడం దురదృష్టకరం. బెల్లం అనేది నిత్యావసర వస్తువు అలాంటి బెల్లం పై ఆంక్షలు విధించడం ప్రభుత్వం చేతకానితనం. బెల్లం ఆక్వా రైతులకు అవసరం. బెల్లం దొరక్క ఆక్వా రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ యొక్క తుగ్లక్ విధానం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇలాంటి విధానాలకు స్వస్తి పలకాలి అని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఎస్ వి బాబు, ఒడుగు ప్రభాస్ రాజు, కూనసాని నాగబాబు, తిరుమణి రామాంజనేయులు, పులగం శ్రీను, ఎలుబంటి విజయ్ కృష్ణ, ఇంటి కిరణ్, పితాని సురేష్, కాజా మణికంఠ, పెద్ది సతీష్, పాశం నాగమల్లేశ్వరరావు, పుప్పాల సూర్యనారాయణ, కొపినేటి శివమణి, పినిశెట్టి రాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు.