అంగన్వాడీలకు అండగా ఉండడమంటే ఇచ్చిన మాట తప్పడమా జగనన్నా?

  • గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం: గుత్తి మండలం, ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం దగ్గర అంగన్వాడీలు వారి న్యాయపరమైన డిమాండ్లు సాధనకై చేపట్టిన సామూహిక ధర్నా కార్యక్రమంలో జనసేన – తెలుగుదేశం పార్టీలా తరఫున సంఘీభావం తెలిపి వారికి మద్దతు ప్రకటించిన గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్ మరియు జనసేన, తెలుగుదేశం పార్టీలా నాయకులు, కార్యకర్తలు.. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో మహిళలకు, అంగన్వాడీ సిబ్బందికి అండగా నేనున్నాను అని చెప్పిన వ్యక్తి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కి సామూహిక నిరసన దీక్షలు చేస్తున్న కనీసం ఇప్పటివరకు పిలిచి మాట్లాడలేదు అంటే, అంగన్వాడి మహిళలకు అండగా ఉండడం అంటే ఇదేనా జగనన్న అని ప్రశ్నించారు. ప్రధానంగా పాదయాత్రలో తెలంగాణలో కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానన్న మీ హామీ ఏమైంది, సీఎం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లయితే అంగన్వాడీలు రోడ్డు ఎక్కే దుస్థితి వచ్చేదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం న్యాయం చేసే వరకు అంగన్వాడీలకు జనసేన, తెలుగుదేశం అండగా ఉంటుందని లేని పక్షాన మరో నాలుగు నెలలలో ఏర్పడబోయే జనసేన – తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అంగన్వాడీ సిబ్బంది కోరిన న్యాయసమ్మతమైనటువంటి ప్రతి సమస్యని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్, గుత్తి మండల సీనియర్ నాయకులు నాగయ్య, మిద్దె ఓబిలేసు, హేమంత్, లోకేష్ కుమార్, ఆకాండబాషా, రఫీక్, జంగళ వెంకిటేష్, నాగేంద్ర జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, కప్పట్రాల కోటేశ్వరరావు, కసాపురం నందా, వంశీ, ఆటో రామకృష్ణ, అమర్ జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.