విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన జగన్ ప్రభుత్వం: ఎస్ వి బాబు

విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేస్తున్నాం, ఆంగ్ల మాధ్యమాన్ని ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాం అంటూ ఆర్భాటం చేసి.. పదో తరగతి పరీక్ష ఫలితాలు చూసినప్పుడు కేవలం ప్రసార ఆర్భాటాలకు తప్ప క్షేత్రస్థాయిలో విద్యా వ్యవస్థను పూర్తిగా విస్మరించారని స్పష్టమవుతుంది.

రెండు లక్షల పైచిలుకు విద్యార్థులు పదో తరగతిలో ఫెయిల్ అవటాన్ని ప్రభుత్వ వైఫల్యం గా చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఫలితాలు రాలేదు.

సజ్జల రామకృష్ణారెడ్డి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం వలన ఎక్కువ మంది ఉత్తీర్ణులు కాలేదని ఇప్పుడు చెప్పడం సజ్జల అజ్ఞానానికి నిదర్శనం.

గతంలో ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆంగ్ల మాధ్యమం పై చర్చిద్దామని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు, వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పుబట్టారు.

పేద విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని అసత్య ఆరోపణలు చేశారు.

ముఖ్యంగా ఫలితాలు దారుణంగా రావడానికి వైసిపి అధికారం చేపట్టిన తరువాత విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.

ఉపాధ్యాయులకు బోధనేతర పనులకు ఉపయోగించడం ఫలితాలు అద్వానంగా వచ్చాయి.

నాడు నేడు పనులు ఉపాధ్యాయులకు పని భారాన్ని పెంచాయి.
మధ్యాహ్నం భోజన పథకంలో చిక్కిలు, కోడిగుడ్లు లెక్క పెట్టడం కూడా ఉపాధ్యాయులకు అప్పగించడం ప్రస్తుత ఫలితాలకు ఒక కారణం.
అంతేకాకుండా ఉపాధ్యాయులు ప్రతిరోజు ఆన్లైన్ ద్వారా రిపోర్ట్ పంపాలని నిబంధనలు ఉండటంవల్ల మీరు బోధనపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నారు.

90% హై స్కూల్ లో బోధనేతర సిబ్బంది లేరు. ఉపాధ్యాయుల కూడా కొరత ఉంది.

ఎం.ఈ.ఓల కొరత ఎక్కువగా ఉంది. ఒక్కొక్క ఎం.ఈ.ఓ మూడు, నాలుగు మండలాలు మానిటరింగ్ చేయటం వలన సమన్వయం లోపిస్తుంది.

తాను ముఖ్యమంత్రి అయితే ప్రతి సంవత్సరము డీఎస్సీ ద్వారా 50 వేల మంది ఉపాధ్యాయులు భర్తీ చేస్తానని ఇచ్చిన హామీని వైసిపి ప్రభుత్వ గాలికొదిలేసింది.

71 ప్రభుత్వ పాఠశాలలో ఒక్కరు కూడా ఉత్తీర్ణత కాకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని అద్దం పడుతుంది.
విద్యాశాఖ మంత్రి పదో తరగతి ఫలితాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలి.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడైనా నోరు విప్పాలి.

సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఫీజును పూర్తిగా రద్దు చేయాలి అని జనసేన పార్టీ తరపున పెడన నియోజవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు డిమాండ్ చేశారు.