మందపాటి దుర్గారావు ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

*జులై మొదటి వారం నుండి దాచేపల్లి మండలంలో జనంలోకి జనసేన కార్యక్రమం: మందపాటి దుర్గారావు

గురజాల నియోజకవర్గం, దాచేపల్లి మండలం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆదేశానుసారం.. క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం శనివారం మండల పార్టీ కార్యాలయంలో.. మండల పార్టీ అధ్యక్షుడు మందపాటి దుర్గారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా క్రియాశీలక సభ్యత్వాలు చేసినటువంటి వాలంటీర్లు అందరికీ ప్రశంసా పత్రాలతో పాటు.. సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి.. అనంతరం మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలకు సభ్యత్వ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మందపాటి దుర్గారావు మాట్లాడుతూ.. కార్యకర్తల శ్రేయస్సు కొరకు పవన్ కళ్యాణ్ చేపట్టిన ఇన్సూరెన్స్ బీమా చేయించడం గొప్ప నిర్ణయం అని ఈ రోజున భీమా కి సంబంధించిన ఇన్సూరెన్స్ కార్డులు భీమా కిట్లు పంపిణీ చేయడం జరిగిందని.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జులై మొదటి వారం నుంచి దాచేపల్లి మండలంలో జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా గడపగడపకు జనసేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామ..ని కచ్చితంగా గురజాల నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, ప్రోగ్రాం కమిటీ మెంబర్ వేల్పుల చైతన్య, ఎన్ఆర్ఐ జనసేన సభ్యులు అంబటి సత్యనారాయణ, 8 వ వార్డుకౌన్సిలర్ అంబటి సుధారాణి, స్వామి, మండల జనసేన నాయకులు శానం బుజ్జి, కిచ్చంశెట్టి లక్ష్మీనారాయణ, నల్లబోతుల శీను, కోట మధు, నంబురి మధు, బొజ్జ ఆదినారాయణ, బూసి నాగేశ్వరావు, జక్కా సుబ్బయ్య, వీర మహిళలు రాజేశ్వరి, వెంకటనరసమ్మ, వాలంటీర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.