రాజోలు జనసేన ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్

రాజోలు నియోజకవర్గం, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం రెండు గ్రామాలలో రామరాజులంక మరియు అంతర్వేదికర గ్రామాలలో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి బట్టేలంకకు చెందిన బోనం సాయి కుమారుడు బోనంరవితేజ ట్రాక్టర్ డిజల్ ఖర్చులకు ఆర్ధికసాయమందించగా రామరాజులంక మరియు అంతర్వేది జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలికిపురం మండల ఎంపిపి మేడిచర్ల సత్యవాణిరాము పాల్గొన్నారని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.