వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, టేకిశెట్టి పాలెం గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలను జనసేన నాయకులు సందర్శించి వారి అవసరాలను అడిగి తెలుసుకుని వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామని భరోసాని కల్పించారు.. ప్రభుత్వం నుంచి రావలసిన సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్నందున అందరూ కూడా పునరవస కేంద్రాలకు వెళ్లాల్సిందిగా జనసేన నాయకులు బాధితులకు తెలియజేశారు.. అదేవిధంగా అధికారులు బాధితులకు సరైన సమయంలో ఆహారాన్ని అందించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో టేకిశెట్టి పాలెం గ్రామ సర్పంచ్ దేవి దుర్గ తాతయ్య నాయుడు, మరియు ఉప సర్పంచ్ కటిక రెడ్డి మహేష్, జనసేన నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, మండెల బాబి నాయుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు రావూరి తేజ, మండల కమిటీ మెంబర్ గణేష్ నాయుడు, మేడిచర్ల దుర్గా ప్రసాద్, గ్రామస్తులు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.