గుంటూరు జనసేన జిల్లా కార్యాలయంలో డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

గుంటూరు, జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో డా.బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకలు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటిగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాదె మాట్లాడుతూ… పెద్దలు కీ.శే బాబు జగజీవన్ రామ్ 116 వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం చాలా ఆనందదాయకంగా ఉంది. మన భారత దేశంలోనే అత్యధికంగా ఎక్కువ సమయం పార్లమెంటైనర్గా ఉన్న వ్యక్తి అలాగే మంత్రివర్గంలో రకరకాల పోర్ట్ పొలియోలు చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్. జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒకటి అయిన “కులాలను కలిపి ఆలోచన విధానం” ను ఆయన విద్యార్థి దశనుంచే ఒక కులం వారికి ఒక్కొక్క మంచినీటు కుండ పెట్టి మంచినీరు త్రాగే విధానాన్ని వ్యతిరేకించి ఆ కుండలని పగలగొట్టి ఒక్క కుండలోనే అందరూ నీళ్లు తాగే విధానాన్ని తీసుకువచ్చిన మహానుభావుడు ఆయన. అలాంటి మహనుభావుని ఆలోచనతో ముందుకు వచ్చిన పార్టీ జనసేన పార్టీ అని చాలా గర్వంగా చెబుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, నారదాసు రామచంద్ర చట్టాల, త్రినాథ్, శిఖా బాలు, కొర్రపాటి నాగేశ్వరరావు, కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మ, దాసరి లక్ష్మి, నగర నాయకులు కొండూరు కిషోర్, కొత్తకోట ప్రసాద్, కిషోర్, ఆకుల ప్రసాద్, గంగరాజు, నాని, రాజ్ కుమార్, నరేష్, బుల్లి తదితరులు పాల్గొన్నారు.