కాకినాడ జనసేన ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

కాకినాడ సిటిలో సిటి ఇంచార్జ్ మరియు పి.ఏ.సి సభ్యుడు ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పురస్కరించుకుని 7వ డివిజన్లో పి.చిట్టి శేఖర్ ఆధ్వర్యంలో డా.అంబేడ్కర్ విగ్రహానికి పూలదండలు వేసి వారు మన దేశ స్వాతంత్ర్యానికి చేసిన సేవలని గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ ఈనెల మండపేటలో పవన్ కళ్యాణ్ చేసిన తీర్మానంకు అనుగుణంగా దివంగత స్వాతంత్ర్యయోధులను, జాతీయ నాయకులను కుల, మత, వర్గాలకు అతీతంగా స్మరించి వారి విగ్రహాలకు నివాళులు అర్పించే కార్యక్రమం కాకినాడ నగరంలో ఘనంగా వారోత్సవాలుగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రయత్నం యువతకు మార్గదర్శం కావాలని, జాతి కోసం వారి సేవలను పునస్మరించుకుంటూ భావితరాలకు వారి ఆదర్శాలను తెలియపరచాలిసిన ధర్మం మన అందరిమీదా ఉందన్నారు. ఈనాడు మన భారత జాతి పటిష్టంగా ఉందంటే దానికి కారణం డా. బాబాసాహేబ్ అంబేడ్కర్ దూరదృష్టి అని, ఆయన కీర్తి ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ నాయకురాళ్ళు, ఆప్రాంత ప్రజలు, జనసైనికులు మరియు విద్యార్ధులు పాల్గొన్నారు.