పురపాలక పాఠశాలలో జెండా వందనం

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, పురపాలక పాఠశాలలో జెండా వందనం అమలాపురం పట్టణం పురపాలక సంఘ పరిధిలో 9వ వార్డు ఝాన్సీ లక్ష్మీబాయి ప్రాథమిక పాఠశాలలో జెండా వందనం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి వాసు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మలిశెట్టి మూర్తి, ఉపాధ్యాయురాలు సత్యవతి విద్యా కమిటీ చైర్మన్ గొల్లపల్లి నాగబాబు, ఈతకోట శ్రావణ్, నల్లా చిన్ని, నల్లా ఈశ్వరుడు పాల్గొన్నారు.