అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి: గంగారపు రాందాస్ చౌదరి

మదనపల్లి కాలనీ గేట్ లో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో కలసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నల్ల బ్యాడ్జ్ దరించి ప్రభుత్వ వైఖరి పట్ల శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డిల రాజ్యాంగం కాకుండా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీ కార్యాలయం మంగళగిరి లో నాలుగో విడత వ్యవహయాత్ర కోసం హైదరాబాదు నుండి పోలీసుల అడ్డుకొని ఇబ్బందికి గురి చేశారు. నారా చంద్రబాబునాయుడుని ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా రాజకీయ కుట్రతో కక్ష సాధింపుతో అరెస్టు చేశారని, లా అండ్ ఆర్డర్ లేదు రౌడీయిజం రాజ్యాంగం ఏలుతుందని అన్నారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ పిఏసి సమావేశానికి వస్తుంటే అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మేము వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి ఒకటే తెలియజేస్తున్నాం అక్కడ ఉన్నది కొణిదెల కొదమ సింహం పవన్ కళ్యాణ్ ఆయనకు భయం లేదు, బెదురు లేదు, మోసం లేదు, దగా లేదు, ఆయన దగ్గర ఉన్నాదంతా గుండె ధైర్యం, నిజాయితీ, నిబద్ధత అని తెలియజేశారు. మదనపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి సంఘీభావం తెలియచేసారు. రాబోయే కాలంలో విపక్షాల మీద బిజేపి, సిపిఐ, సిపిఎం, ఏ పార్టీ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయాలని చూసిన మదనపల్లి జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, ఐటీ విభాగ నాయకులు జగదీష్, గండికోట లోకేష్, జంగాల గౌతమ్, రెడ్డెమ్మ, కుమార్, నాగవేణి, లవన్న, నవాజ్, సత్య, దినకర్, సాదిక్, నవీన్, భాను, సాయి, ప్రవీణ్, వెంకీ తదితరులు పాల్గొన్నారు.