మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలలో ముఖ్య అతిధిగా ఆదాడ

🔸 మొదటి రోజు మొక్కలు నాటిన మెగాభిమానులు
🔸 విజయనగరం జిల్లా చిరంజీవి యువత &అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం ఆధ్వర్యంలో ప్రారంభం
🔸 ముఖ్య అతిధిగా హాజరైన జనసేన నాయకులు అదాడ

విజయనగరం, మాజీ రాజ్యసభ సభ్యులు, పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలను జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నాడు మొక్కలు నాటే కార్యక్రమంతో ప్రారంభించారు. స్థానిక 46వ డివిజన్, కనపాక ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి చేతులు మీదుగా మొక్కలు నాటి, ఇంటినిటికి మొక్కలు పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆదాడ మెహనరావు మాట్లాడుతూ కళామ్మాతల్లి ముద్దుబిడ్డ, సినీపరిశ్రమకు పెద్దదిక్కు, మెగాభిమానులకు ఆదర్శం మైన చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకొని ఇటువంటి సేవకార్యక్రమాలను చేయటం అభినందనీయమని, ప్రతీఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. మెగాభిమానులు చేస్తున్న సేవలను గూర్చి కొనియాడారు. జిల్లా చిరంజీవి యువత కార్యదర్శి పిడుగు సతీష్, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయునిలు పతివాడ కృష్ణవేణి, రాజేశ్వరి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) చిరంజీవి యువత ప్రతినిధులు, జనసేన నాయకులు డాక్టర్ ఎస్. మురళీమోహన్, అలబోయిన శివ గణేష్ యాదవ్, నొడగల నారాయణరావు, నొడగల సాయి, గొరిపిండి చిరంజీవి, పడగల రామకృష్ణ, సురేష్, అలబోని దీపు, కొండ్రు సాయి, చందక గణేష్ తదితరులు పాల్గొన్నారు.