సర్వేపల్లి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

సర్వేపల్లి, మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలో చిరంజీవి గారి వీరాభిమాని ప్రజారాజ్యం పార్టీలో మండల అధ్యక్షుడిగా చేసి చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నేడు జనసేన పార్టీలో జనసేన కార్యకర్తగా ఉన్నటువంటి షేక్ రహమాన్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదే విధంగా ఒక సామాన్య కానిస్టేబుల్ కొడుకుగా జన్మించి ఆయన పట్టుదలతో సినీ వీనిలాకాశంలో ఒక మెగాస్టార్ గా ఎదిగి కొన్ని కోట్ల మంది తెలుగువారి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకొని ఆయన గొప్ప సేవ భావం కలిగిన వ్యక్తిగా ఒక శక్తిగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా ఒకానొక సమయంలో ఒక ప్యాకెట్ రక్తం దొరకాలన్నా ఎంతో కష్టం అటువంటి తరుణంలో బ్లడ్ బ్యాంక్ పెట్టి కొన్ని లక్షల మందిలో చైతన్యం తీసుకువచ్చి సజావుగా రక్తం దొరికే విధంగా ఒక ప్రాణం కూడా పోకుండా కాపాడినటువంటి వ్యక్తి అదేవిధంగా కొన్ని వేల మందికి చూపునిచ్చే విధంగా ఐ బ్యాంకును స్థాపించి చీకటి జీవితాలలో వెలుగును నింపిన మహానుభావుడు. ఇటీవల కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే సమయంలో ఆక్సిజన్ బ్యాంకు పెట్టి ఉచితంగా ఆక్సిజన్ అందించడానికి చేయూతనిచ్చినటువంటి మహనీయ మూర్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కోకొల్లలు. అటువంటి మహానుభావుడుకి ఈరోజు జన్మదిన పురస్కరించుకొని కేక్ కట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారు ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని అంజని పుత్రుడు ఎప్పుడు చిరంజీవుడు గానే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, స్థానికులు వీరబాబు, శ్రీహరి, పవన్ తదితరులు పాల్గొన్నారు.