పాలకొండ నియోజకవర్గం జనసేన కార్యాలయంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సత్తిబాబు గారు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలు ఒక బలమైనటువంటి మార్పు కోసం తపిస్తున్నారో.. అలాంటి సమాజాన్ని మనం తీసుకురావాలని, అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలను, పార్టీ మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రచారం చేయాలని జనసైనికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జల్లు సొంబాబు, ఎన్ని శ్రీను, విశ్వనాథం, సాయి, గణేష్, మీడితాన ప్రసాద్, పి. శేకర్, గర్భాపు నరేంద్ర, సతివాడ వెంకటరమణ, జె.రాంబాబు, యోగి, అనిల్, సతీష్, నారాయణరావు, రమేష్, 4 మండలాల జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *