జనసేన శ్రమదానం.. ఒక్క ఫోన్ కాల్ తో రోడ్డు మరమ్మత్తు

అర్బన్: అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్య క్షులు, అర్బన్ నియోజకవర్గం ఇంచార్జ్ టీసీ వరుణ్ వినూత్న ఆలోచనతో పార్టీ శ్రేణులను మమేకం చేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉంటూ.. బుధవారం ప్రజా సేవే లక్ష్యంగా జనసేన శ్రమదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక్క ఫోన్ 9398854513 కాల్ చేస్తే చాలు 24 గంటల్లోపు గుంతలు పడ్డ రహదారులకు మరమ్మతులు చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ మేరకు వారు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని స్థానిక సప్తగిరి సర్కిల్, అలాగే పాతూరులో ఉన్న పవర్ ఆఫీస్ వద్ద ఘోరంగా గుంతలు పడ్డ ప్రధాన రోడ్లను మరమ్మత్తులు చేశారు.