కెనడా ప్రవాస భారతీయులు జనసేనకు చేస్తున్న సేవలు అభినందనీయం
- గతంలో “కౌలు రైతు భరోసా”కు రూ 5,55,555 విరాళం అందజేసారు
- ఇప్పుడు “నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజుని “డొనెషన్ డే” గా జరుపుకుంటూ కెనడా జనసేన టీం జనసేన పార్టీకి రూ 11,11,111 విరాళం అందచేసింది
ఉద్యోగరీత్యా ఏడు సముద్రాల అవతల ఉన్నా, రాజకీయ ప్రక్షాళన చేయడానికి జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తూ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు మంచి జరగాలి అని కోరుకునే జనసేనాని తోనే మా కెనడా జనసైనికులు అడుగులు అనే నినాదంతో తమ మద్దతును ప్రకటిస్తున్నారు.
కెనడా జనసేన టీం గతంలో జరిగిన 2019 ఎలక్షన్స్ నుండి పార్టీకి అండగా ఉంటూ ప్రచార రధాలు అంధించడం, పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మొక్కలు పంచడం, గ్రామ స్థాయిలో పార్టీ ప్రచార సామాగ్రిని సమకూర్చడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు.
అవినీతి రాజకీయాలను అంతం చేసి తెలుగు ప్రజలకు మంచి పాలన అందించాలి అని జనసేనాని చేసే ఈ పోరాటం లో శ్రీ పవన్ కల్యణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా తుదిశ్వాస వరకూ జనసేనానికి అండగా నిలబడతాం అని తెలిపారు.
కెనడా లో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-1.09.24-PM-1024x686.jpeg)