నెల్లూరులో ‘నా సేన కోసం నా వంతు’

నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి సూచనలతో ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కార్యదర్శి, కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నెల్లూరు నగరం కూరగాయల మార్కెట్ లో వ్యాపారులు వద్ద పార్టీ విధానాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవలగురించి తెలిపి పార్టీ నిర్దేశించిన ఫోన్ నంబర్ కి మార్కెట్ లో వర్తకులు, కూరగాయలు కొనేందుకు వచ్చిన వారి ద్వారా నా సేన కోసం నా వంతు కు సహకరించాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నగర ప్రధాన కార్యదర్శి ఈ.సురేష్, యు.రమేష్, ఎ.జీవన్, చక్రి, నరేంద్ర, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.